Site icon Prime9

Munugode: కేసిఆర్ అవినీతి మీటరుకు లెక్క తేల్చేది మునుగోడు ప్రజలే…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

KCR's corruption meter, people will see the calculation

KCR's corruption meter, people will see the calculation

Munugode by poll: అవినీతి కుటుంబ పాలనకు నవంబర్ 3న మునుగోడు ప్రజలు మీటర్లు తో లెక్క తేల్చనున్నారని పెట్టనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపధ్యంలో భాజపా అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ పై కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవానికి, కల్వకుంట్ల కుటుంబ అహంకారినికి మద్య జరుగుతున్న ఎన్నికగా ఆయన పేర్కొన్నారు. 2023లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక పరిమాణాలు చోటుచేసుకొనేందకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో ముఖ్యంగా తెలిపారు. అవినీతి, అక్రమాలు, నియంతృత్వ ధోరణిలతో గడిచిన 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతాకుతలం చేశారని విమర్శించారు. కేసిఆర్ అండ్ టీంకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్న మైందన్నారు.

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు, పోరాటయోధులు నేడు టీఆర్ఎస్ పార్టీలో లేకపోవడాన్ని కిషన్ రెడ్డి తప్పు బట్టారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ పేరులో సైతం తెలంగాణను లేకుండా తీసేసారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం లేనట్లు, అంతా సశ్యామలంగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. దీన్ని దేశం యావత్తు రోల్ మాడల్ గా తీసుకోవాలని కేసిఆర్ కోరుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

దళితులపై ప్రేమ చూపిస్తున్నట్లు హుజూరాబాద్ ఎన్నికల్లో తీసుకొచ్చిన దళిత బంధు స్కీంతో అక్కడి ప్రజలు భాజపాను ఆశీర్వదించారన్నారు. ఎన్ని స్కీంలు, మద్యం, డబ్బు ప్రవాహాలు తీసుకొచ్చిన భాజపాని గెలిపించేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా ఉన్నారన్న ధీమాను కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. ర్యాలీలో భాజపా నేతలు బండి సంజయ్, వివేక్, అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: India Map: ఇండియా మ్యాప్ లోపల కేసిఆర్ ఫోటో.. సిటీ పోలీస్ కు ఫిర్యాదు

Exit mobile version