Site icon Prime9

Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ కు ముహూర్తం ఫిక్స్ ..

kantara chapter 1 first look release date announced

kantara chapter 1 first look release date announced

Kantara Chapter 1: ‘కేజీఎఫ్’ చిత్రం తరువాత కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామూలు సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు . రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించారు. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రం ఇంతటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ని కూడా తీసుకు రావాలని మేకర్స్ భావించారు.కర్ణాటకలోని తుళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార చిత్రానికి, రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితిలో కాంతార చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు అంటే ఆ చిత్రం ఎంతలా ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతార చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. కాంతార సినిమా హీరో తండ్రి పాత్ర ముగియడంతో మొదలవుతుంది. ఇప్పుడు ఆ తండ్రి పాత్రని మొదలుగా తీసుకోని కాంతార 2ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన పంజుర్లి దైవ కథతో పీరియాడిక్ సినిమాగా ఉండబోతుందని సమాచారం. కాంతార 2 కోసం చాలా రీసర్చ్ చేసిన రిషబ్ శెట్టి.. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టి చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.

ఈ నెల 27న మధ్యాహ్నం గం.12:25 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ రూపంలో ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ తో ఆడియన్స్ ని కాంతార ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్నారట. హోంబేలె ఫిలిమ్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తుంది. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంకే స్టార్ కాస్ట్ కనిపించబోతుందో తెలియాల్సి ఉంది.దీనికోసం మైండ్ బ్లోయింగ్ పోస్టర్ తో అనౌన్సమెంట్ చేసారు. అగ్ని కీలలు విరజిమ్ముతున్నట్లు ఒక కాంతి కనిపించేలా పోస్టర్ ఉంది.దానిపై ఇది కాంతి మాత్రమే కాదు.. దర్శనం అని పోస్టర్ పై ఉంది. మొత్తంగా కాంతార ప్రీక్వెల్ హీట్ సోమవారం నుంచి షురూ కానుంది.

Exit mobile version