Kanna Laxmi Narayana: కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ సీనియర్ నేత తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత.. చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
తెదేపా లోకి కన్నా లక్ష్మీ నారాయణ.. (Kanna Laxmi Narayana)
బీజేపికి రాజీనామా చేసిన తర్వాత కన్నా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో కన్నా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుత రాష్ట్ర భాజపా అధ్యక్షుడు.. సొము వీర్రాజుతో కన్నా విభేదించారు. బహిరంగగానే వీర్రాజును ఉద్దేశించి కన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై అధిష్టానం ప్రత్యేకంగా వివరాలు సేకరించినప్పటికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కన్నా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో.. ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో చివరకు ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి అనుగుణంగానే.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకులతో సమావేశం అనంతరం.. భాజపాకు రాజీనామా చేశారు.
కనీసం పలకరించని బీజేపి నేతలు..
రాజకీయాల్లో కన్నా ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. పార్టీలో వివాదరహితుడిగా, స్ట్రాంగ్ పాలిటిక్స్‌ను నడిపే వ్యక్తిగా మంచి పేరుంది. భాజపాకు రాజీనామా చేసిన అనంతరం.. ఆ పార్టీకి చెందిన నాయకులు కనీసం పలకరించలేదనే విమర్శ ఉంది. బహిరంగగానే సోము వీర్రాజు ప్రవర్తన నచ్చలేదని.. అందువల్లనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీతో సంబంధం లేకుండా.. జీవీఎల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రంగా పేరు క్రిష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశామని అన్నారు. అదే సమయంలో.. జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేదని అన్నారు. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
23న టీడీపీలోకి కన్నా..
భాజపాకు రాజీనామా చేసిన తర్వాత కన్నా రెండు రోజులపాటు సైలెంట్ గా ఉన్నారు. తన ముఖ్య అనుచరులతో.. ప్రత్యేకంగా సమావేశమైన కన్నా ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అండగా నిలిచిన క్యాడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక.. తెదేపాలో చేరాలని ఎక్కువ మంది చెబుతున్నారని తెలిపారు. జనసేన లోకి వెళ్లాలంటే.. అక్కడ భాజపాతో పొత్తు ఉన్నందున.. తెదేపా లో చేరుతున్నట్లు ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే మంతనాలు ముగిశాయని తెలుస్తోంది.