Site icon Prime9

Kangana Ranaut : ప్రియాంక విషయంలో కరణ్ జోహార్ పై ఫైర్ అయిన కంగనా రనౌత్.. వరుస ట్వీట్స్

kangana ranaut tweets about bollywood and karan johar

kangana ranaut tweets about bollywood and karan johar

Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఉంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌పై ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేస్తూ కరణ్‌పై విరుచుకుపడ్డారు.

ప్రియాంక చోప్రా ఇటీవల అమెరికన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బాలీవుడ్‌కు దూరం కావడంపై సంచలన ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు. అంతేకాదు, బాలీవుడ్‌లో తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ రెండుగా విడిపోయింది. వివేక్ అగ్నిహోత్రి, కంగన రనౌత్ వంటివారు ఆమెకు అండగా నిలిస్తే, మరికొందరు మాత్రం ప్రియాంకపై విమర్శలు గుప్పించారు.

కరణ్ జోహార్ కి ఆ విషయం నచ్చలేదు.. అందుకే (Kangana Ranaut)

ఈ నేపథ్యంలో కంగన తాజాగా వరుస ట్వీట్లు చేస్తూ దర్శక, నిర్మాత కరణ్ జొహార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించి పరిశ్రమను విడిచిపెట్టేలా చేశారని అన్నారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షారూఖ్‌తో ప్రియాంక స్నేహం చేయడం కరణ్‌కు నచ్చలేదని, దీంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ విషయంలో అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు. కరణ్ జొహార్ ఆమెను బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వారికి హాని కలిగించాలని ఎదురుచూసే మూవీ మాఫియాకు ప్రియాంక దొరికిందని, ఆమె దేశం విడిచి వెళ్లిపోయే వరకు వేధించారని కంగన ఆరోపించారు. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేసినందుకు కరణ్ జొహార్ బాధ్యత వహించాలని అన్నారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటివారు సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇలాంటి పరిస్థితులు లేవని కంగన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, కంగనా చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి అని చెప్పాలి.

Exit mobile version