Site icon Prime9

Thug Life: కమల్‌ హాసర్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది – ‘థగ్‌ లైఫ్‌’ టీజర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ కూడా చేప్పేసిన టీం

Thug Life Release Date and Teaser: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విక్రమ్‌ వంటి చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. అదే జోష్‌లో ఆయన వరుసగా సినిమాలను క్యూలో పెడుతున్నారు. ఇటీవల ఆయన ‘భారతీయుడు 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోకపోయిన కమల్‌ హాసన్‌ యాక్టింగ్‌, యాక్షన్‌ పర్ఫెమెన్స్‌కి మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్‌ అనే సినిమా చేస్తున్నారు. నాయకుడు సినిమా తర్వాత దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న చిత్రమిది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ లోకనాయకుడు కమల్‌ బర్త్‌డే సందర్భంగా థగ్‌లైఫ్‌ నుంచి టీజర్‌తో రిలీజ్‌ చేశారు. అదేవిధంగా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు.

సుమారు 44 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సాగింది. ఇందులో కమల్‌ హాసన్‌ లుక్‌ని పరిచయం చేశారు. ఇందులో కమల్‌ విభిన్న షేడ్స్‌లో కనిపించారు. చూస్తుంటే ఆయన మల్టిపుల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2025 జూన్‌ 5న విడుదల చేస్తున్నట్టు ఈ సందర్భంగా మూవీ టీం వెల్లడించింది. కమల్‌ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే మణిరత్నం దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

రాజ్‌ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌, మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌, ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సిగ్మా థగ్‌ రూల్‌’ అంటూ శింబు క్యారెక్టర్‌ని పరిచయం చేసింది మూవీ టీం. శింబుతో పాటు దుల్కర్‌ సల్మాన్‌, ‘జయం’ రవి, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version