Site icon Prime9

Tirumala Srivaru: శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్

Chief Justice of the Supreme Court visited 

Chief Justice of the Supreme Court visited 

Justice UU Lalith: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. సతీ సమేతంగా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకొన్న చీఫ్ జస్టిస్ కు టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఘన స్వాగతం పలికారు. బంగారు ధ్వజస్ధంభానికి మొక్కిన అనంతరం గర్భాలయంలోని మూల విరాట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో సిజె లలిత్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనాలు అందచేశారు. తీర్ధ ప్రసాదాలతో పాటు నూతన సంవత్సరం క్యాలండర్, డైరీలను న్యాయమూర్తికి అందించారు. చీఫ్ జస్టిస్ హోదాలో తొలిసారిగా ఆయన తిరుమలకు విచ్చేసారు.

ఇది కూడా చదవండి:Hyderabad: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల ఎంట్రీతో..!

Exit mobile version