Site icon Prime9

Andhra Pradesh Governor : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్..

justice abdul nazeer appointed as andhra pradesh governor

justice abdul nazeer appointed as andhra pradesh governor

Andhra Pradesh Governor : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్‌గా ఉన్న బిస్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‍‌లో ఒకరు.

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.  లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన భగత్‭సింగ్ కోశ్యారీ.. తాజాగా అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. వారి స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్ బైస్ నియమితులయ్యారు.

కొత్త గవర్నర్ల వివరాలు (Andhra Pradesh Governor)..

ఆంధ్రప్రదేశ్ – రిటైర్డ్ జస్టీస్ ఎస్. అబ్దుల్ నజీర్

అరుణాచల్ ప్రదేశ్ – లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్.

అసోం – గులాబ్ చంద్ కటారియా

బీహార్ – రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్

ఛత్తీస్‌గడ్ – బిస్వభూషణ్ హరిచందన్

జార్ఖండ్ – సీపీ రాధాకృష్ణన్

హిమాచల్ ప్రదేశ్ – శివ్ ప్రతాప్ శుక్లా

సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

మణిపూర్ – అనసూయ

నాగాలాండ్ – గణేషన్

మేఘాలయా – ఫగు చౌహాన్

మహారాష్ట్ర – రమేశ్ బైస్

లడఖ్ – బీడీ మిశ్రా

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version