Site icon Prime9

Jr Ntr : వాళ్ళకి నా పాదాభి వందనాలు అంటూ ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు

jr ntr got best actor award for rrr in siima awards 2023

jr ntr got best actor award for rrr in siima awards 2023

Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ కి.. ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నె. 1 తో మొదలైన వేట.. ఆది సినిమా బ్లాక్ బ్లస్టర్‌తో స్టార్‌డమ్ తెచ్చుకొని.. ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం యంగ్ టైగర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.

ఈ మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది ఈ అమ్మడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తారక్  (Jr Ntr) తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా 2023 వేడుకల్లో పాల్గొన్నారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకు గాను ఆయనకు ఉత్తమ నటుడిగా సైమా 2023 అవార్డ్ దక్కడం విశేషం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..  కొమరం భీం పాత్రకి నేను న్యాయం చేస్తానని నన్ను మళ్ళీ నమ్మిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా బ్రదర్, కోస్టార్ రామ్ చరణ్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నా అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఒడిదుడుకుల్లో నా వెంట ఉండి కింద పడ్డప్పుడల్లా పైకి లేపినందుకు.. నా కంట కన్నీటి చుక్క వచ్చినప్పుడల్లా వారు కూడా బాధపడినందుకు.. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు సంతోషంగా నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్న అంటూ తారక్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ఎన్టీఆర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతో అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

 

 

11 వ సారి నిర్వహిస్తున్న ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ముందుగా ఈ అవార్డు వేడుకల్లో భాగంగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల ప్రధానోత్సవం జరగగా.. నేడు తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుక జరగనుంది.  ఉత్తమ నటుడి కేటగిరీలో అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ – సీతారామం, నిఖిల్ – కార్తికేయ 2 , సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు చిత్రాల నుంచి పోటీ పడగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ రేసులో కొనసాగారు. అయితే తుది విజేతగా ఎన్టీఆర్ నిలవడం విశేషం. ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

 

Exit mobile version