Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న “దేవర” సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ అందాలను ఏ మాత్రం దాచుకోకుండా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.