Site icon Prime9

Pawan Kalyan : వరుస ట్వీట్లతో జగన్ సర్కారు పై నిప్పులు చెరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ..!

janasena-chief-pawan-kalyan-fires-on-ycp-through-twitter-posts

janasena-chief-pawan-kalyan-fires-on-ycp-through-twitter-posts

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా పై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఇటీవలే పవన్ తన ప్రచార రధం ” వారాహి ” కి సంబంధించిన వీడియోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వైకాపా నేతలు వివాదాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారాహికి ఉన్న రంగు గురించే ఈ చర్చ అంతా నడుస్తుంది. ఈ తరుణంలోనే పవన్ ఈరోజు ఉదయం నుంచి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా మొదటగా కనీసం ఈ ఆలివ్ గ్రీన్ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైసీపీ? అంటూ ఒక పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఇప్పుడు మరోమారు వరుస ట్వీట్లతో వైకాపాను ఏకీపారేస్తున్నారు.

ఆ తర్వాత మొదట్లో తన సినిమాలను అడ్డుకున్నారని.. ఆ తర్వాత తాను విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని, సిటీ నుంచి వెళ్లిపోవాలని తనను ఒత్తిడి చేశారని పవన్ దుయ్యబట్టారు. తాడేపల్లి నుంచి ఇప్పటం బాధితులను కలవడానికి వెళ్తుంటే అప్పుడు కూడా తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా అనేక ఆటంకాలు కలిగించారని మండిపడ్డారు. ఇప్పుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వైసీపీ నేతలు వివాదాన్ని సృష్టిస్తున్నారని అన్నారు.

ఆ తర్వాత పచ్చని చెట్లు ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన పవన్ మీకు ఏ రకమైన పచ్చని రంగు కావాలో తేల్చుకోవలంటూ దుయ్యబట్టారు.

ఇక ఆ వెంటనే అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి అని పోస్ట్ చేశారు.

అలానే విద్యార్థులు ఈర్ష్యగా భావించినప్పుడు మరియు ఇతర పిల్లల విషయాల గురించి దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ వాక్యాన్ని మా క్లాస్ టీచర్ పాఠశాలలో చెప్పేవారంటూ బైబిల్ వాక్యాన్ని పోస్ట్ చేశారు. సామెతలు 14:30; “శాంతితో ఉన్న హృదయం శరీరానికి జీవాన్ని ఇస్తుంది, కానీ అసూయ ఎముకలను కుళ్ళిస్తుంది.” అంటూ వైకాపా నేతలకు హితబోధ చేశారు.

అదే విధంగా వారాహి రంగులోనే ఉన్న ఒక బైక్, ఒక కారు ఫోటోను పోస్ట్ చేస్తూ రూల్స్ అనేవి కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమేనా… అ షరతులు వీరికి వర్తించవా అంటూ ప్రశ్నించారు.

కారు టూ కట్‌డ్రాయర్‌ వైసీపీ టిక్కెట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన “ కారు నుంచి కట్‌డ్రాయర్‌ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్‌ అంటూ ఆరోపించారు. ఈ విధంగా పవన్ వరుస ట్వీట్లు చేస్తుండడంతో ఆయన అభిమానులు, జనశెన కార్యకర్తలు పవన్ కి మద్దతుగా పోస్ట్ లు పెడుతూ జగన్ సర్కారుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ల పర్వం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version