Site icon Prime9

Adipurush : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ “జై శ్రీరామ్” లిరికల్ మోషన్ పోస్టర్..

jai shriram motion poster release from prabhas adipurush movie

jai shriram motion poster release from prabhas adipurush movie

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ఆపడేట్ వచ్చింది.

గూస్‌ బంప్స్ గ్యారంటీ అనిపిస్తున్న జై శ్రీరామ్ (Adipurush)..

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ నుంచి ఓ బిట్‌ను లిరికల్ మోషన్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు. ‘జై శ్రీరామ్’ అంటూ సాగే ఈ పాట వింటుంటే అందరికీ గూస్‌ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ తో సంగీత దర్శకుడు అంచనాలను డబుల్ చేయగా.. రామ జోగయ్య శాస్త్రి మరోసాటి సాహిత్యంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ లిరికల్ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా విల్లును ఎక్కుపెడుతూ కనిపించడం అభిమానులందరికీ హై ఫీస్ట్ ఇస్తుంది. ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందించగా.. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

కాగా మరో వైపు న్యూయార్క్ వేదికగా ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ 2023 జరగనుంది. జూన్ 7 నుండి 18 వరకు వివిధ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రఖ్యాత వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆదిపురుష్ అర్హత సాధించింది. ట్రిబెక 2023 నందు ఆదిపురుష్ చిత్ర ప్రదర్శన జరగనుంది. జూన్ 13న ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ నందు ఆదిపురుష్ మూవీ ప్రీమియర్ వేయనున్నారు. సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ  ఫెస్టివల్ లో ప్రభాస్ సినిమా ప్రదర్శించబోతుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్..  మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Exit mobile version