Jagapathi Babu : ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా బిజీగా ఉన్నారు. తాజాగా జగపతిబాబు సల్మాన్ ఖాన్ నటించిన “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” సినిమాలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో వెంకటేష్ ముఖ్యపాత్ర పోషించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సాంగ్ లో క్యామియో కూడా ఇవ్వగా.. విలన్ రోల్ లో జగపతి బాబు నటించారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పడంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా జగపతి బాబు ఇంకా చెబుతూ.. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో నటించడంతో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
మొదటిసారి అల్లు అర్జున్ ని అక్కడే చూశాను – జగపతిబాబు (Jagapathi Babu)
ఆయన నాకు గొప్ప పాత్రలు ఇస్తారు.. పుష్ప 2 లో కూడా మంచి పాత్ర ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అంతకు ముందు చిత్రాలా లాగే ఈ చిత్రంలో కూడా నాకోసం సుక్కు ఒక బెస్ట్ పాత్రను రాశాడు. అతనితో పనిచేయడానికి నేనెప్పుడూ రెడీ గా ఉంటా అని తెలిపారు. ఇక అల్లు అర్జున్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ని మొదటి సారి 20 ఏళ్ళ క్రితం ఓ జిమ్ లో చూశాను. అప్పుడు వెంటనే గుర్తుపట్టలేదు. ఆ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మంచి పాత్రలతో వస్తే ఏ భాషలోనైనా సినిమాలు చేస్తాను అని జగపతిబాబు తెలిపారు. సుక్కు దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో సర్పంచ్ ఫణింద్ర భూపతిగా జగపతి బాబు నటించాడు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి.
పుష్ప 1 లోనే సునీల్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2లో మరింత జగపతి బాబు కూడా తాను పుష్ప 2లో ఉన్నాడు అని తెలియడంతో పార్ట్ 3 కూడా ఉండనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ జగపతిబాబు విలన్ రోల్ కా? లేక మరేదైనా ముఖ్య పాత్ర లో చేస్తున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.