Site icon Prime9

Nani 30 : మరోసారి నాన్నగా “నాని”… ఈసారి కూడా మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

interesting update from natural star nani upcoming movie

interesting update from natural star nani upcoming movie

Nani 30 : నాచురల్ స్టార్ నాని అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్ అవుతుండడంతో న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా గురించిన అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. తన కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవలే మూవీ అనౌన్స్ మెంట్ ఇచ్చిన నాని… ఇప్పుడు మరో వీడియోతో మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నాని, ఒక పాపతో కూర్చోని ‘నాని 30’ గురించిన వివరాలను ఆసక్తికరంగా వెల్లడించాడు. ఆ పాప నానితో… నాన్న ఈ గడ్డం నచ్చలా అని చెప్తుంది. అందుకు నాని ఇది దసరా కోసం … మనం సినిమాకి గడ్డంతో ఉండను, మీసాలు ఉంచను అని చెప్తాడు. జుట్టు ఉంచమని ఆ పాప చెప్తుంది. ఆ తర్వాత తన కూతురు ఎవరు కోరుకుంటే వాళ్లు సినిమాలో భాగం అయ్యి ఉంటారని చెప్తూనే… తహన సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూని రివీల్ చేశాడు నాని.

ఈ మేరకు మూవీలో హీరోయిన్ గా ‘సీతా రామం’ ఫేమ్ ‘మృణాల్‌ ఠాకూర్‌’ నటిస్తుండగా… ‘శౌర్యువ్’ అనే కొత్త డైరెక్టర్ సినిమాని తెరకెక్కించనున్నాడు. అలానే ఈ చిత్రంలో నాని కూతురి పాత్రలో ‘బాబే కియారా ఖన్నా’ నటిస్తుంది. ‘హ్రిదయం’ మ్యూజిక్ డైరెక్టర్ ‘హీషం అబ్దుల్ వాహబ్’ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఆద్యంతం ఇంటరెస్టింగ్ గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ పోషించిన నాని… తన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రంలో పాపకి తండ్రిగా నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

Exit mobile version