Site icon Prime9

Nandamuri Balakrishna Fan : పెళ్ళికి బాలకృష్ణ వస్తేనే చేసుకుంటానంటున్న అభిమాని.. మూడేళ్లుగా వెయిటింగ్

interesting marriage story of nandamuri balakrishna fan

interesting marriage story of nandamuri balakrishna fan

Nandamuri Balakrishna Fan : నందమూరి నటసింహం బాలకృష్ణది మనసులో ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. సాధారణంగా బాలకృష్ణ అంటే అందరికీ కొంత భయం ఉంటుంది. సీరియస్ గా , ముక్కుసూటిగా ఉంటారు అని … ఎక్కువ ఫ్రీ గా ఉండరేమో అని ఎక్కువగా అనుకుంటారు. అయితే ఇటీవల ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ లోని మరో యాంగిల్ ని అందరూ తెలుసుకోగలిగారు. కానీ కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని ఎంతో అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

ఏ హీరో కూడా ఆయన అభిమానుల్ని కొట్టిన సందర్భాలు లేవు. కానీ బాలయ్య తన అభిమనులపై పలు సార్లు చేయిచేసుకున్నప్పటికి కూడా బాలయ్యాను ఇష్టపడుతూనే ఉంటారు. సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అభిమాన హీరోల కోసం ఏమైనా చేయడానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ సిద్ధపడతారు. తమ హీరోల సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. బ్యానర్స్ పెట్టడం, పాలాభిషేకాలు చేయడం వంటివి ఎన్నో చేస్తుంటారు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఇంకో మెట్టుపైనే ఉంటారని చెప్పుకోవచ్చు తాజాగా బాలయ్య అభిమాని ఒకరు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే (Nandamuri Balakrishna Fan)..

విశాఖపట్నం.. పెందుర్తి కి చెందిన కోమలీ పెద్దినాయుడు.. బాలకృష్ణకు వీరాభిమాని. అతనికి గౌతమీ ప్రియ అనే అమ్మాయితో 2019లోనే ఎంగేజ్​మెంట్ అయిపోయింది. అయితే పెద్దినాయుడితో పాటు గౌతమి కూడా బాలయ్య అభిమాని. బాలయ్య అంటే పడిచచ్చే పెద్దినాయుడు.. తన పెళ్లికి రావాల్సిందిగా వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యను ఆహ్వానించాడు. అయితే ఖాళీగా లేకపోవడం అప్పట్లో ఆయన రాలేకపోయారు. ఆతరువాత కరోనా వల్ల లాక్​డౌన్ వల్ల బాలకృష్ణకు ఆ పెళ్లికి రావడం కుదరలేదు.

అయితే అప్పటి నుంచి పెద్ది నాయుడు పెళ్లి చేసుకోకుండా బాలయ్య రాకకోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. బాలయ్య వస్తేనే తాను తాళి కడతాను అని దాదాపు మూడేళ్లుగా ఎదరుచూస్తున్నాడు పెద్దినాయుడు. అంతే కాదు ఈమధ్యలో బాలక్రిష్ణకు వీలు కుదిరేలా ఓరెండు మూడు ముహూర్తాలు కూడా పెట్టించాడట. కాని అప్పుడు కూడా బాలక్రిష్ణ రాకపోవడంతో.. తాజాగా ఈనెల 11న మరోసారి పెళ్ళి ముహూర్తం కుదుర్చుకున్నాడు పెద్దినాయుడు. ఈపెళ్ళికి బాలయ్య వస్తానని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఇన్నాళ్లు పెళ్లి జరగకుండా ఎలా ఆపగలిగారు, అమ్మాయి తరపు నుంచి ఎలాంటి ప్రెజర్ రాలేదా అని అతన్ని ప్రశ్నించగా..? తాను చేసుకోబోయే అమ్మాయి.. ఆమె ఫ్యామిలీతో పాటుగా మా ఊరు మొత్తం బాలకృష్ణకు వీరాభిమానులమే.. అందుకే ఇదంతా సాధ్యం అయ్యింది అని అంటున్నాడు పెళ్ళి కొడుకు. అంతే కాదు రేపు పెళ్ళికి బాలయ్య వస్తున్నాడని.. గ్రాండ్ గా వెల్కం చెప్పడానికి.. ఊరు ఊరంతా సిద్దం అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పెద్ది నాయుడు పెళ్లి వార్తా హాట్ టాపిక్ గా మారింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version