Site icon Prime9

కైకాల సత్యనారాయణ : రిలీజ్‌కు రెడీ అవుతున్న కైకాల సత్యనారాయణ చివరి సినిమా… మళ్ళీ అదే పాత్రలో

interesting detaills about kaikala sathyanarayana last movie

interesting detaills about kaikala sathyanarayana last movie

Kaikala Sathyanarayana : ప్రముఖ తెలుగు దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల వయస్సు ఉన్న కైకాల 60 ఏళ్ల పాటు టాలీవుడ్ లో న‌ట జీవితాన్ని కొనసాగించారు. వందలాది సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల. ముఖ్యంగా స‌త్య‌నారాయ‌ణ పేరు విన‌గానే ఆయ‌న పోషించిన పాత్ర‌ల్లో మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే రోల్ య‌మ ధ‌ర్మ‌రాజు. య‌మ‌గోల‌, య‌ముడికి మొగుడు, య‌మ‌గోల మ‌ళ్ళీ మొద‌లైంది, ద‌రువు చిత్రాల్లో య‌మ ధ‌ర్మ‌రాజుగా కైకాల అద్భుతంగా న‌టించి మెప్పించారు. అయితే ఇటీవల వయోభారంతో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన.

సుమారు 777 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ… ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. చివరిగా మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షి సినిమాలో కనిపించారు కైకాల. అయితే సత్యనారాయణ మరో సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. ఇందులో గమనించాల్సిన మరో విషయం ఏంటంటే… ఈ సినిమాలో కూడా కైకాల య‌మ ధ‌ర్మ‌రాజు పాత్ర‌లో నటించడం. పూర్ణానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘ధీర్ఘాయుష్మాన్‌ భ‌వ‌’. టారస్ సినీకార్ప్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి జంటగా నటించిన ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే కైకాల సత్యనారాయణ కాలం చేయడం కలచి వేసిందని చిత్ర నిర్మాత‌లు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు కైకాల సత్యనారాయణ గారు అని అన్నారు. మేము నిర్మిస్తున్న ఆయన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’లో కైకాల సత్యనారాయణగారు యుముడి పాత్రని పోషించారు. ఈ రోజు కైకాల సత్యనారాయణగారు మన మధ్య లేకపోవడం బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కైకాల గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు.

Exit mobile version