Site icon Prime9

World Population Day: జనాభాలో చైనాను మించిపోనున్న భారత్

New Delhi: ప్రపంచ జనాభాలో భారత్‌ రికార్డు బద్దలు కొట్టనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి జనాభాలో చైనాకు కూడా మించిపోతుందని తాజాగా విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. యూనైటెడ నేషన్స్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ సొషల్‌ ఎఫైర్‌ పాపులేషన్‌ డివిజన్‌ ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్‌ 2022 నివేదికలో ఈ అంశాలను పొందుపర్చింది. ప్రపంచ జనాభాలో 2030 నాటికి 850 కోట్లకు 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ జనాభా కాస్తా మందగించిందని వెల్లడించింది. 2080 నాటిక ప్రపంచ జనాభా 1,040 కోట్లకు చేరుతుందని, 2100 సంవత్సరం వరకు ఇదే స్థాయిలో జనాభా ఉంటుందని యూఎన్‌ తాజా నివేదికలో వివరించింది.

ఈ ఏడాది ఈ రోజు అంటే జులై 11వ తేదీన వరల్డ్‌ పాపులేషన్‌ డే జరుపుకుంటున్నట్లు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటర్రెస్‌ చెప్పారు. ఈ భూమిపై ప్రజల్లో మానవత్వం, మెరుగైన ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు గణనీయంగా ప్రసవం సమయంలో శిశు మరణాలు బాగా తగ్గాయని గుటెర్రెస్‌ అన్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు భూగ్రహాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన గుర్తు చేశారు.

2050 వరకు ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ జనాభా మొత్తం ఎనిమిది దేశాల్లో పెరగనుంది. అవి ఇండియా, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్‌, పిలిప్పీన్స్‌, టాంజానియాలో కనిపించనుంది. దీనికి వ్యతిరేకంగా ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఓషియానియాలో జనాభా కాస్తా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని యూఎన్‌ నివేదికలో పేర్కొంది.

Exit mobile version