Site icon Prime9

Asia Cup 2022: ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే..

team india players unhappy with food in Sidney practice match

team india players unhappy with food in Sidney practice match

Asia Cup 2022: యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇక, జట్టులో కొత్త ముఖాలకు స్థానం కల్పించలేదు. ప్రధానంగా, టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లను గాయాల కారణంగా పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఆసియా కప్ కోసం శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ స్టాండ్ బై ఆటగాళ్లుగా కొనసాగుతారని బోర్డు తెలిపింది. ఆసియా కప్ పోటీలు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్నాయి

టీమిండియా జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు.

Exit mobile version