Ind vs Nz 1st ODI: విరాట్ ను దాటి.. రికార్డుల మోత మోగించిన శుభ్ మన్ గిల్

Ind vs Nz 1st ODI: ఉప్పల్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగుతున్న మొదటి వన్డేలో భారత్ పరుగుల వరద పారించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ( 149 బంతుల్లో 208 పరుగులు, 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు.

ఈ ఇన్నింగ్స్ లో చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వరుస ఇన్నింగ్స్ లో సెంచరీ, డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

అదే విధంగా కెరీర్ లో మొదటి డబుల్ సెంచరీ చేసి అతి చిన్న వయసు (23 ఏళ్ల 132 రోజులు)లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

గిల్ ఖాతాలో పలు రికార్డులు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 5 వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. సచిన్, వీరేంద్ర సెహ్యాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ల తర్వాత గిల్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. వీరిలో రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు.

భారత్ తరపున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డు. అంతకుముందు ఈ ఫీట్ విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ పేరిట ఉంది. వారిద్ధరు 25 మ్యాచుల్లో 1000 పరుగులు సాధించారు.

అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు సాధించిన ఆటగాడు గిల్.

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరుతో ఉంది. 2009 లో ఆసిస్ పై 175 పరుగులు చేశాడు సచిన్.

వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరుతో ఉంది.

వరుస వన్డే(Ind vs Nz 1st ODI) ఇన్నింగ్స్ లో సెంచరీ, డబుల్ సెంచరీ పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత గిల్ ది.

పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ కేవలం 18 మ్యాచుల్లో 1000 పరుగుల మార్క్ అందుకోగా., మరో పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ తో కలిసి గిల్ 19 మ్యాచుల్లో రెండో స్థానంలో ఉన్నాడు.

5 వ వికెట్ కోల్పోయిన కివీస్

కాగా, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. 145 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ అందుకున్నాడు.

కోహ్లీ(8), ఇషాన్ కిషన్ (5), నిరాశపర్చారు. రోహిత్ శర్మ (34), సూర్య కుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్, షమి నాటౌట్ గా నిలిచారు.

350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగన కివీస్ ప్రస్తుతం 112 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/