Site icon Prime9

IND vs ENG 1st ODI: నేడు భారత్-ఇంగ్లాండ్ ల మధ్య తొలి వన్డే

IND vs ENG: టీ20 సిరీస్ గెలుపుతో ఉత్సహాంగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ సాయంత్రం లండన్ లోని ఓవల్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని టూర్ ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది. మరో వైపు ఇంగ్లాండ్ కూడా పటిష్టంగానే ఉంది. టీ20 సిరీస్ ఓటమితో నిరాశ చెందిన ఇంగ్లాండ్. వన్డే సిరీస్ చేజిక్కించుకుని తమ సత్తా చూపాలని వ్యూహాలు పన్నుతోంది.

తొలి వన్డేకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా కోహ్లీ హాజరు కాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే కోహ్లీ ఫామ్ లో లేని కారణంగానే అతనిపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. బీసీసీఐ అధికారులు మాత్రం కోహ్లీకి గాయం అయిందని ప్రకటించినట్లు తెలుస్తోంది. తొలి వన్డే మినహా మిగతా రెండు వన్డేలకు కోహ్లీ ఆడతాడని చెబుతున్నారు. అయితే కోహ్లీ ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫామ్ లో లేని కోహ్లీని టీం నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version