Site icon Prime9

PM Modi: మీరు మాపై బురద జల్లితే.. బురదలో కూడా కమలం వికసిస్తుంది.. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు

PM Modi

PM Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్దిని అడ్డుకుంటోందని ఆరోపించారు ప్రధాని. గత ఆరు దతాబ్దాల కాలంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ది పథంలో దూసుకుపోగా.. భారత్‌ మాత్రం బాగా వెనుకబడిపోయిందన్నారు.

కాంగ్రెస్ పాలన దేశ ప్రగతిని దెబ్బతీసింది..(PM Modi)

కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన దేశ ప్రగతిని దెబ్బతీసింది.దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు కాంగ్రెస్ విధానాల వల్ల సమాధానం లేదు. కాంగ్రెస్‌కు ‘ఆలస్యం చేసే సంస్కృతి’ ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత 9 ఏళ్లలో 48 కోట్ల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు తెరిచారని ప్రధాని మోదీ అన్నారు. శాశ్వత పరిష్కారంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు. మా ప్రభుత్వం 11 కోట్ల మందికి తాగునీరు అందించింది. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యుడి మంచినీటి కష్టాలు తీర్చిందా అని సూటిగా ప్రశ్నించారు. ఇంతకుముందు, ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల కష్టార్జిత డబ్బును పాడుచేసేది.కానీ మేము ధోరణిని మార్చాము. కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలను తెరచామంటూ మోదీ చెప్పారు.

బురదలో కూడా కమలం వికసిస్తుంది..

ప్రధాని ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు మోదీ -అదానీ బాయి.. .బాయి అంటూ మోదీ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ గిరిజనుల కోసం, పేద వారి కోసం సన్నకారు రైతుల సంక్షేమం కోసం పనిచేసి ఉంటే తాను ఈ 21వ శతాబ్దంలో కష్టపడాల్సిన అవసరం లేదు కదా అని కాంగ్రెస్‌ పార్టీకి కౌంటర్‌ ఇచ్చారు. సభలో కొంత మంది సభ్యుల ప్రవర్తన తనకు నిరాశ కలిగిందన్నారు ప్రధాని. మీరు మాపై బురద జల్లితే. బురదలో కూడా కమలం వికసిస్తుందని ప్రధాని తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

చెప్పేది గరీబీ హటావో.. చేసిందేమీ లేదు..(PM Modi)

కాంగ్రెస్ చెప్పేది ‘ గరీబీ హటావో’ కానీ 4 దశాబ్దాలుగా ఏమీ చేయలేదు. మా ప్రాధాన్యత సామాన్య ప్రజానీకమే, అందుకే మేము ఎల్పీజీ కనెక్షన్ల పథకాన్ని తీసుకువచ్చాము.మన దేశస్థుల జీవితాలలో మార్పులను తీసుకురావడానికి మేము కష్టపడి పని చేసే మార్గాన్ని ఎంచుకున్నాము.మౌలిక సదుపాయాల యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. భారతదేశం కాంగ్రెస్‌ను పదే పదే తిరస్కరిస్తోంది, కానీ అది నేర్చుకోదని అన్నారు.

నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ?

నిజమైన లౌకికవాదం పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూసుకోవడం.విద్య, మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్యం మెరుగుపడింది. ప్రభుత్వం 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది ప్రజలు కాంగ్రెస్‌ని శిక్షిస్తున్నారు కాంగ్రెస్ పాలనలో మన శాస్త్రవేత్తలు అవమానాన్ని ఎదుర్కొన్నారు భారతీయ యువత కాంగ్రెస్‌ను తిరస్కరించారు. నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ? దేశం కుటుంబ ఆస్తి కాదు అని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు.

హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రతిపక్ష పార్టీలు తమ డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 8) లోక్‌సభలో ప్రధాని సమాధానం సమయంలో కొందరు ఎంపీలు వాకౌట్ కూడా చేశారు.

PM Modi Speech In Rajya Sabha | PM Modi Responds To GST Criticism | Prime9 News

ఇవి కూడా చదవండి:

Exit mobile version
Skip to toolbar