Site icon Prime9

Hyper Aadi : అంబటి, వర్మ, గరికపాటిపై.. పంచ్ లతో విరుచుకుపడ్డ హైపర్ ఆది

hyper aadi comments on rgv and ambati rambabu at bhola shankar event

hyper aadi comments on rgv and ambati rambabu at bhola shankar event

 Hyper Aadi :  మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దరకత్వంలో చేస్తున్న చిత్రం “భోళా శంకర్”. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. ఈ మూవీతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.  తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది.

ఈ ఏవేమత లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే వారికి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేశాడు. ముందుగా తెలుగులో ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అలాగే, చిరంజీవి గురించి మాట్లాడే స్థాయి కూడా ఎవరికీ లేదు. ఆ దర్శకుడు చిన్న పెగ్ వేస్తే చిరంజీవి గారి గురించి, పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తాడు. నాకు తెలిసి మీ వ్యూహాలు దెబ్బ తింటాయని నా గట్టి నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి అన్నారని అర్థం అవుతోంది. మరి ప్రతి విషయంపై స్పందనచ్చే వర్మ ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో అని చూడాలి.

అలాగే హీరో సుమన్, ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని దోషిగా చూపించే పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇటీవల గరికపాటి విషయం కూడా వైరల్ అయిన ఆవిషయం తెలిసిందే. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి.. కొన్ని కోట్ల మంది అభిమానించే చిరంజీవి గారి మీద అసహనం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండా, చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా! ఎదురుగా ఉన్నవాళ్లకు ఎలా ఉండాలో నేర్పించే ఆయన సహనం కోల్పోయారు గానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు. ఆ సభ సజావుగా జరిగేలా చేశారు.. అదీ చిరంజీవి అంటే అని వ్యాఖ్యానించారు.

ఇక చివరగా ఎలక్షన్స్ గురించి మాట్లాడిల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో.. ‘భోళా శంకర్’ దర్శక నిర్మాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత వచ్చాయనేది వాళ్ళు చెబుతారు. మొన్న కలెక్షన్స్ తక్కువ వచ్చాయట.. అవును ఆయన వెనక వేసుకున్న కలెక్షన్స్ తో పోలిస్తే మన కలెక్షన్స్ తక్కువే అని పరోక్షంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్  బ్రో సినిమా – అంబటి రాంబాబు ఈ రెండు విషయాలే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. మొత్తానికి అయితే ఆది (Hyper Aadi) అందరికీ కలిపి ఒకే వేదికగా తిరిగి నోరెత్తకుండా.. గట్టిగా కౌంటర్లు ఇచ్చినట్లు అర్దం అవుతుంది.

Exit mobile version