Site icon Prime9

MP Komatireddy: తెలంగాణలో హంగ్.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

komatireddy

komatireddy

MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.

తెలంగాణలో హంగ్ ఖాయం..

కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు.. మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తమ్ముడు భాజపాలో చేరడం.. మునుగోడులో కాంగ్రెస్ కు ప్రచారం చేయకపోవడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. దీంతో కాంగ్రెస్ కు వేరేమార్గం లేదని.. మరొకరితో కలవాల్సిందేనని అన్నారు. ఎన్నికల తర్వాత ఈ విషయం గురించి చర్చిస్తామని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోని రాలేదు.. (MP Komatireddy)

దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి 60 స్థానాలకు మించి రావని అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కాంగ్రెస్ మరో ప్రత్యామ్నాయం లేదని.. మరో పార్టీతో కలవాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు బాగా కష్టపడితే.. 40-50 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 1 నుంచి అందరం కలిసి పార్టీకోసం పనిచేస్తామన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నూతన ఇంఛార్జ్ మానిక్ ఠాక్రే పై వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మానిక్ రావ్ ఠాక్రే వచ్చాక పార్టీలో పరిస్థితులు మారాయని అన్నారు. రాష్ట్రంలో పాదయాత్ర.. బైక్ యాత్ర చేస్తానని తెలిపారు. అందరూ ఒకే చోటు నుంచి కాకుండా.. వివిధ ప్రాంతాల నుంచి నాయకులు పాదయాత్ర చేయాలని సూచించారు. పాదయాత్రల సందర్భంగా.. తెలంగాణ సాధించుకున్నది ఎందుకో.. ప్రజలకు వివరించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.

గెలిచేవారికే ఎన్నికల్లో సీట్లు..

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెంకట్ రెడ్డి అన్నారు. తమవారికే సీట్లు ఇవ్వాలనుకుంటే.. పార్టీ మనుగడ కష్టమని అన్నారు. గెలిచేవారికే సీట్లు ఇవ్వాలని వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉందని అన్నారు. శాసనసభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పొగిడారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ మాతో కలవాల్సిందే కాబట్టి.. కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

Exit mobile version