Site icon Prime9

Odiyamma song : హాయ్ నాన్న నుండి” ఒడియమ్మా” సాంగ్ .. ఫుల్ పార్టీ మూడ్ లోకి ఫ్యాన్స్ ..

hero-nani-odiyamma-song-released

hero-nani-odiyamma-song-released

Odiyamma song : న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతుంది . ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని 30వ సినిమాగా తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే మూవీ మకర్స్ వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇంకోపక్క నాని.. పాన్ ఇండియా లెవల్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. ఇక సినిమాలో హైలైట్ గా మారింది.. శృతి హాసన్. ఒక స్పెషల్ సాంగ్ కోసం శృతి, నానితో జత కట్టింది. అందులో భాగంగా తాజాగా ‘ఓడియమ్మా’ అనే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. నాని, శ్రుతి హాసన్‌లపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

బీచ్ ఒడ్డున ఫుల్ జోష్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ సెట్ లో నాని, శృతి లుక్ అదిరిపోయింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్, శృతి హాసన్ ఆలపించడం విశేషం. అనంత శ్రీరామ్ గారిచే ఈ పాట రాయబడింది. సాంగ్ ఫుల్ పార్టీ మూడ్ లోకి తీసుకువెళ్ళేలా ఉంది. దీనిలో నాని , శృతి హాసన్ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేలా ఉన్నారు.ఇప్పటి వరకు వచ్చిన హాయ్ నాన్న మూవీ సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను బాగా అలరించాయి . ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఆ రేంజ్ లో ఉండబోతున్నట్టు చెపుతున్నారు . దీనితో సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

 

Exit mobile version