Site icon Prime9

Naga Chaitanya-Sobhita: మరికొద్ది గంటల్లో నాగచైతన్య-శోభిత పెళ్లి – వేడుకకు వచ్చే అతిథులు వీరే!

Naga Chaitanya sobhita wedding

Naga Chaitanya sobhita wedding

Naga Chaitanya Sobhita Wedding Guests: అక్కినేని నాగచైతన్య. శోభితలు మరికొద్ది గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయ పద్దతిలో మూడు బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి పనులకు సంబంధించిన ఏర్పాట్లు చై-శోభితలు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ వేడుకకు వచ్చే అతిథులను జాబితా కూడా వారే నిర్ణయించినట్టు నాగార్జున్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో చై-శోభితల పెళ్లి వచ్చే అతిథులు ఎవరనేది ఆసక్తిగా మారింది.

అయితే ఈ పెళ్లికి సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారట. ఇక ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాస్టార్‌ చిరంజీవి, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, రామ్‌ చరణ్‌ దంపతులు, బ్రహ్మనందంతో పాటు పలువురు అగ్రకథనాయకులు, దర్శక-నిర్మాతలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించనున్నారు. అలాగే అల్లు అర్జున్‌ కూడా సతీసమేతంగా ఈ పెళ్లి వేడుకలో సందడి చేయనున్నాడట. కాగా డిసెంబర్‌ 5న పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా బన్నీ రేపు చై-శోభితల పెళ్లికి హాజరుకానున్నాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పూర్తి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక

నాగచైతన్య-శోభితల పెళ్లి పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల నుంచి మూడు మూళ్లు పడేవరకు అన్ని సంప్రదాయంగా జరిగేలా రెండు కుటుంబాలు నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అన్ని క్రతువులు వరుసగా నిర్వహిస్తారని సన్నిహితవర్గాల నుంచి తెలిపాయి.

కాగా పెళ్లి వేడుకల భాగంగా కాబోయే వధువరులిద్దరికి ఇటీవల మంగళ స్నానాలు చేయించిన ఫోటోలు శోభిత షేర్‌ చేసింది. కాబోయే జంటను పక్కపక్కన క ఊర్చోబెట్టి హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మంగళ స్నానాలు అనంతరం శోభితను పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత మంగళ హారతులు పట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది.

Exit mobile version
Skip to toolbar