Mega Heros Movies List: గత మూడేళ్ల నుంచి సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ల చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా అభిమానుల ఆకలి తీర్చేలా మెగా జాతర చేసేందుకు మెగాఫ్యామిలీ సిద్దమైందట. ఇంతకీ మెగా హీరోల ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం!
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే చిరు వారసత్వాన్ని గ్లోబల్ రేంజ్‌కి తీసుకువెళ్లాడు. మరోవైపు అల్లు అర్జున్ కూడా సపరేట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అని చెప్పాలి. ఆయనొక ట్రెండ్ సెట్టర్ అనడంలో అతిశయోక్తి లేదు. గత కొంతకాలంగా మెగా కాంపౌండ్ మొత్తం మూవీస్ విషయంలో బాగా స్లోగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2022లో భీమ్లా నాయక్ మూవీతో సోలోగా వచ్చి హిట్ అందుకున్నారు.
ఆ తరువాత ‘బ్రో మూవీతో అటు సాయి దుర్గ తేజ్‌తో కలిసి మూవీ చేశారు. మరోవైపు చిరంజీవి 2023లో వాల్తేరు వీరయ్య’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఆ నెక్స్ట్ వచ్చిన భోళా శంకర్ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టినా.. కమర్షియల్‌గా చిరు స్థాయి కలెక్షన్లు తేలేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తరువాత విశ్వంభర మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాస్. ఇక చెర్రీ నుంచి చివరగా వచ్చిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీలో కీలకపాత్రలో యాక్ట్ చేసిన అది చిరు ఖాతాలోకి వెళ్ళింది. ఆచార్య మూవీ కూడా అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో మొత్తానికి 2022 తర్వాత మూవీస్ విషయంలో మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేందుకు సరైన ఛాన్స్ దొరకలేదు.
కానీ ఈ ఇయర్ ఎండింగ్‌కు వచ్చినా.. మెగా హీరోల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వరుసగా సినిమాల అప్‌డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మెగా హీరోస్. రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్ మూవీలోని రా మచ్చా మచ్చా సాంగ్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా మట్కా మూవీ టీజర్ తో దాన్ని కంటిన్యూ చేశారు. ఇలా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మొదలు పెడితే సంక్రాంతికి విశ్వంభర మూవీ వరకు వరుసగా మెగా సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో పాటు దసరాకు మూవీ టీజర్ రిలీజ్ కానుంది. ఈ మూవీఎప్పుడని బిగ్‌బాస్‌లో నాగార్జున అడిగే సరికి ఒక్క నిమిషం పాటు దిల్‌రాజు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ, వెంటనే క్రిస్‌మస్‌కు రిలీజ్ చేస్తున్నామని కిక్ ఇచ్చే న్యూస్‌ను మెగా ఫ్యాన్స్‌కు బిగ్‌బాస్ వేదికగా దిల్ రాజు అనౌన్స్ చేశారు.
నవంబర్ 14న రిలీజ్ కాబోతున్న వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 మూవీ టీజర్ నవంబర్ లోనే రిలీజ్ కాబోతోంది. విశ్వంభర మూవీ టీజర్ కూడా దసరాకు రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుండగా.. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. విజయవాడలో జరిగిన మూవీ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్‌ను రివీల్ చేశాడు. మరోవైపు వినిపిస్తున్న టాక్ విశ్వభర మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటుందని, గేమ్ ఛేంజర్ ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తుందని అంటున్నారు. మధ్య మధ్యలో పవన్ మూవీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దీంతో ఈ అక్టోబర్ నుంచి మొదలు డిసెంబర్ వరకు మెగా హీరో చిత్రాలు విడుదల కాబోతోన్నాయి. అంతేకాదు వచ్చే ఏడాది వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఉండబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.