Prime9

Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీకి అస్వస్థత

Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. తల్లి అనారోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ వెళ్లనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.

కాగా తాజాగా యూఎన్ మెహతా ఆసుపత్రి వర్గాలు హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారని వెల్లడించింది.

heeraben modi

heeraben modi

హీరాబెన్ వయస్సు ప్రస్తుతం 100 ఏళ్లు. ప్రస్తుతం ఆమె గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో జీవిస్తున్నారు. ప్రధాని మోదీకి తన తల్లితో అనుబంధం ఎంతో అనుబంధం ఉంది. ఆయన పలుమార్లు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని మీడియా వేదికగా చెప్పారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హీరాబెన్‌ను నేరుగా కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు.

గత జూన్‌లో హీరోబెన్ 99వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఆ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న తన తల్లి గురించి ‘మదర్’ అనే టైటిల్‌తో మోదీ ఒక ఎమోషనల్ బ్లాగ్ కూడా రాశారు దానికి పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని మైసూరులో మంగళవారంనాడు కారు ప్రమాదంలో గాయపడిన కొద్ది గంటలకే హీరాబెన్ ఇలా ఆసుపత్రిలో చేరడం కాస్త ఆందోళనకు గురిచేసింది.

ఇదీ చదవండి: గన్‌లో బుల్లెట్ లోడ్ చేయడం రాని ఎస్సై.. ఐజీ తనిఖీలో బుక్కయిన పోలీసులు

Exit mobile version
Skip to toolbar