Site icon Prime9

Weather Updates: మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు… ఆ జిల్లాల ప్రజలు అలెర్ట్..!

latest Weather Update for ap prime9 news

latest Weather Update for ap prime9 news

Weather Updates: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం వాయవ్యదిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ మంగళవారం సాయంత్రానికి మరింత బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 242 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసినట్టు తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల మండలం కాసిపేటలో 5.36 సెంటీ మీటర్లు వర్షం కురువగా.. అత్యల్పం నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 3.61 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొనింది.

ఇదీ చదవండి: RTC Fares during Dussehra: దసరాకు ఆర్టీసీలో సాధారణ చార్జీలే

Exit mobile version