Site icon Prime9

Harish Shankar: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీపై రానా ట్రోలింగ్‌ – హరీశ్‌ శంకర్‌ రియాక్షన్‌ చూశారా?

Rana Trolls Ravi Teja Mr Bachchan Movie: మాస్‌ మహారాజా రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌ని సైతం ఈ సినిమా డిసప్పాయింట్‌ చేసింది. దీంతో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుని ప్లాప్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్‌ హీరో రానా దగ్గుబాటి వేసిన సటైరికల్‌ కామెంట్స్‌ వేశారు. ఐఫా అవార్డు ఫంక్షన్‌లో రానా మిస్టర్‌ బచ్చన్‌ని ఉద్దేశించి సటైరికల్‌ కామెంట్స్‌ వేయగా.. వీటికి హరీష్‌ శంకర్‌ తనదైన స్టైల్లో స్పందించారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

గత దుబాయ్‌లోని ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రానా, హనుమాన్‌ హీరో తేజా సజ్జాలు హోస్ట్‌గా వ్యవహరించిన సినీ తారలను అలరించారు. దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియోను తాజాగా ఐఫా సంస్థ విడుదల చేయగా.. ఇందులో రానా మిస్టర్‌ బచ్చన్‌ మూవీపై వేసిన పంచ్‌ బయట పడింది. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఈ ఏడాది హైయెస్ట్‌ హై చూశారు లోయెస్ట్‌ లో కూడా చూశారు అంటూ రానా అనగా.. అందుకు తేజ సజ్జా.. హైయ్యెస్ట్‌ హై కల్కి.. మరి లోయేస్ట్‌లో లో అంటే.. అనగారే.. అదే మిస్టర్‌ బచ్చన్‌ అంటూ కామెంట్‌ చేశాడు.

దీంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా కాగా రవితేజ ఫ్యాన్స్‌ ఫీల్‌ అవుతున్నారు. దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మళ్లీ రవితేజతో హిట్‌ ఎప్పుడు కొడతావు? అన్ని హరీష్‌ శంకర్‌ని ట్యాగ్‌ చేశాడు. ఇది కాస్తా హరీష్ శంకర్‌ కంటపడటంతో ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. “ఎన్నో విన్నాను తమ్ముడు.. అందులో ఇది ఒకటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. నాకైనా ఎవరికైనా…” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version