Hanuman: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో చిత్రం ‘హనుమాన్’. (Hanuman) ఈ చిత్ర టీజర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు.. ఇతర భాషల్లోను మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తేదీ ప్రకటనను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా సమ్మర్ కానుకగా.. మే 12న పదకొండు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రయోగాత్మక సినిమానులు తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడు ప్రశాంత్ వర్మ. ‘ఆ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పారచుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు యంగ్ హీరో తేజసజ్జాతో ‘హను మాన్’ (Hanuman) అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ చిత్రం 11 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందులో కొరియన్, జపనీస్, ఇంగ్లీష్, స్పానీష్, చైనీస్ భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో విడుదల అవ్వడం ఇదే తొలిసారని చిత్ర బృందం ప్రకటించింది. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కి విపరీతమైన ప్రేక్షక ఆదరణ లభించింది. దర్శకుడు చూపించిన విజువల్ వండర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ మరో హిట్ ని అందుకుంటాడా.. లేదా అనేది మే 12వరకు వేచి చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/