Site icon Prime9

Governor Tamilisai: నాపై ట్రోల్స్ చేస్తే అగ్గిలా మారుతా: గవర్నర్ తమిళ సై

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: ‘నా శరీరం గురించి కొంతమంది అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్లగా ఉన్నానని, నదురు బట్టతల లాగా ఉంటుందని ఎగతాళిగా చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ . చెన్నై లో ఓ ప్రైవేటు స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో తమిళ పై పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారన్నారు.

తన రంగు నలుపు అని, బట్టతల అని, పొట్టి గా ఉంటానని కొంతమంది అదేపనిగా హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇంకో సారి ఎవరైనా తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అగ్గిలా మారుతానని, తన ఎత్తు, బట్టతల అని విమర్శించే వారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని తమిళ సై అన్నారు.

అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే(Governor Tamilisai)

బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు తన జీవితంలో జరిగిన సంఘటలనే తమిళసై వివరించారు.

సమాజంలో కొంతమంది అదే పనిగా శాడిజం చూపిస్తారన్నారు.

ఎవరు ఎలా ఎగతాళి చేసినా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని.. అవసరమైతే అగ్గి రవ్వలా మారాలని బాలికలకు సూచించారు తమిళసై.

తనపై అడ్డ గోలుగా వ్యాఖ్యలు చేసే వారిని పట్టించుకోనని.. కష్టపడి పనిచేయడమే తనకు తెలుసన్నారు. ఉన్నత స్థాయికి చేరి తన సత్తా ఏంటో చూపిస్తానని తమిళ సై తెలిపారు.

ఈ క్రమంలో బాడీ షేమింగ్ పై చేసిన ట్రోల్స్ ను గుర్తు చేసుకున్న ఆమె మండిపడ్డారు.

జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి శరీర రంగు, జుట్టు ముఖ్యం కాదని, కొండంత ఆత్మవిశ్వాసం చాలని ఆమె చెప్పారు.

 

గతంలో సాయిపల్లవికి మద్దతుగా

అయితే ఇపుడు గవర్నర్ తమిళ సై చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశ మయ్యాయి. గతంలో కూడా తమిళ సై బాడీ షేమింగ్ పై స్పందించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అపుడు కూడా గవర్నర్ తమిళ సై స్పందించారు.

సోషల్ మీడియాలో సాయి పల్లవిపై వచ్చిన ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. మహిళలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వారిని తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కూడా గతంలో బాడీ షేమింగ్ కు గురైనట్టు అపుడే వెల్లడించారు. తన ఆకారం, రంగులపై కొందరు కామెంట్ చేశారని చెప్పారు. కానీ వాటిని ధైర్యంగా ఎదురుకున్నట్టు తెలిపారు.

ఇలాంటి కామెంట్స్ బారిన పడకుండా ఉండడానికి మనమేమి మహాత్ములం కాదు అని, కానీ ఇలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్లు బాధపడతారు అనేది గుర్తించుకోవాలి అని ఆమె చెప్పారు.

 

 

 

 

Exit mobile version