Site icon Prime9

AP Assembly Sessions : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు.. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న గవర్నర్ నజీర్

governor abdul nazeer speech in ap assembly sessions

governor abdul nazeer speech in ap assembly sessions

AP Assembly Budget Session : ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఈ మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. అనంతరం గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

పరిశ్రమలు , వ్యవసాయం, సేవా రంగంలో  గణనీయమైన అభివృద్దిని  సాధించినట్టుగా గవర్నర్ చెప్పారు. మన బడి , నాడు-నేడు  ద్వారా తొలి దశలో  రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ  చేపట్టినట్టుగా గవర్నర్ తెలిపారు. అమ్మఒడి  ద్వారా  80 లక్షల  పిల్లలకు  ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గవర్నర్ నజీర్  చెప్పారు. 44.49 లక్షల మంది తల్లులకు  రూ.19,617.60 కోట్ల ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. విద్యా రంగంలో డిజిటల్ లెర్నింగ్  కీలక అంశమని  గవర్నర్ చెప్పారు. డిజిటల్ లెర్నింగ్  కోసం విద్యార్ధులకు  రూ. 690 కోట్ల విలువైన  5.20 లక్షల ట్యాబ్ లను  పంపిణీ చేసినట్టుగా  గవర్నర్ తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం  నుండి పాఠ్యాంశాల సంస్కరణలు అమలు చేస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. ఒకటో తరగతి నుండి  ఏడో తరగతి వరకు  పాఠ్యపుస్తకాల  రీడిజైన్  చేసినట్టుగా గవర్నర్ వివరించారు..జగనన్న  గోరుముద్దతో  43.26 లక్షల మంది  విద్యార్ధులకు లబ్ది  కలగనుందని  గవర్నర్ చెప్పారు.

ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ – గవర్నర్ (AP Assembly Budget Session)

ఆర్ధిక భారం లేకుండా  ఉచితంగా  ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని  గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో  ప్రతి మండలంలో  రెండు జూనియర్ కాలేజీలను  ఏర్పాటు  చేస్తున్నట్టుగా  గవర్నర్ తెలిపారు.  జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్  అందిస్తున్నామన్నారు. అలానే మహిళల భద్రతకు, సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు వస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోందని, అర్హులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చెప్పారు.

కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుతోందని అన్నారు. ద్విభాషా పుస్తకాలు, ఇంగ్లిష్ ల్యాబ్ ల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. కడపలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య  ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. 11.43 వృద్ధి రేటును సాధించామని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లామని తెలిపారు. మనబడి- నాడునేడు ద్వారా తొలి దశలో రూ.3,669 కోట్లతో ఆధునికీకరణ చేపట్టామని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తున్నామని తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version