Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది.
విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది.
ఈ ఘటనలో సుమారు 6 బోగీలు పట్టాలు తప్పాయి అని సమాచారం అందుతుంది.
విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుంటుంది.
విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది.
సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.10కి చేరుకుంటుంది.
అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్ ప్రెస్ అక్కడే నిలిచిపోవడంతో, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెం. 040-27786666 ప్రకటించారు.
Godavari express train stopped near BB NAGAR
బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఘటన..#GodavariExpress #indianrailways@PMOIndia @RailMinIndia @SCRailwayIndia @gmscrailway @TSwithKCR @KTRoffice pic.twitter.com/kmu1rS1szy— YJR (@yjrambabu) February 15, 2023
ఆయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ప్రమాదానికి కారణమని సమాచారం. పట్టాలు తప్పిన బోగీలను వదిలి రైలు బయల్దేరింది. ఎస్-5 నుంచి చివరివరకూ బోగీలు పట్టాలు తప్పగా వాటిని వదిలి, మిగిలిన బోగీలతో రైలుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో బీబీనగర్ రైల్వే స్టేషన్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాదానికి గురైన బోగీలను మినహాయించి రైలును ఉదయమే సికింద్రాబాద్ పంపించారు. మిగిలిన ప్రయాణికులను సైతం వారి వారి గమ్యస్థానాలకు పంపినట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ట్రాక్ 300 మీటర్ల మేరకు పూర్తిగా దెబ్బతిన్నది. దెబ్బతిన్నంత వరకు కొత్త ట్రాక్ వేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక యంత్రాలతో రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/