Prime9

NO Shutdown Theatres: థియేటర్ల బంద్ లేదు.. సినీ వర్గాల ప్రకటన

NO Shutdown Theatres in Telugu States: తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. ఈ మేరకు సినీ నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 నుంచి ఈ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించనుంది. వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించడమే సమావేశాల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

 

ప్రస్తుతం ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల రెవెన్యూ షేరింగ్ విధానంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో జూన్ 1 నుంచి థియేటర్ల సమ్మెకు వెళ్లాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. కానీ తాజా పరిణామాలతో ఆ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. అందకు సంబంధించి ఇవాళ జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్స్ మధ్య కీలక సమావేశం జరిగింది. సమావేశంలో రెండు పక్షాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వెల్లడైంది.

Exit mobile version
Skip to toolbar