Site icon Prime9

Vatti Vasantha Kumar : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..

ex minister vatti vasantha kumar passed away due to health issues

ex minister vatti vasantha kumar passed away due to health issues

Vatti Vasantha Kumar : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూత

కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్

అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్

వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2004, 2009లలో శాసనసభ్యులుగా ఎన్నికైన వసంత్

2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వసంత్

రోశయ్య క్యాబినెట్ లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగింపు

కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన వసంత్ వసంత్ వసంత్

2018 లో టిడిపి- కాంగ్రెస్ కలయిక తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన వసంత్

2014 నుంచి కాంగ్రెస్ కు రాజకీయాలకు దూరంగా విశాఖలో నివాసం ఉంటున్న వసంత్

వసంత్ భౌతికకాయాన్ని సొంత గ్రామం పూండ్ల కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు.

(Vatti Vasantha Kumar) సంతాపం తెలిపిన జనసేన నేత నాదెండ్ల మనోహర్..

జనసేన నేత నాదెండ్ల మనోహర్ వట్టి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఏఈ మేరకు సోషల్ మీడియా వేడియకగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఆ ప్రెస్ నోట్ లో .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వట్టి వసంతకుమార్ కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు.

వసంత్ గ్రామీణాభివృద్ధి, పర్యటక శాఖల మంత్రిగా ఉన్నప్పుడు పలు పథకాలు అమలుపై చర్చించే వాళ్ళం.

అస్వస్థతతో ఉన్న ఆయన కోలుకుంటారనుకున్నాను.

వసంతకుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అని రాసుకొచ్చారు.

 

కాగా 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంతకుమార్ ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స‌మావేశం అయ్యారు.

దీంతో అప్పట్లో జ‌న‌సేన పార్టీలో చేరుతున్నట్లు  వార్తలు కూడా వ‌చ్చాయి.

అయితే, ఆ ప్ర‌చారాన్ని వ‌ట్టి వసంత కుమార్ ఖండించారు.

తాను ప‌వ‌న్ ను మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు.

విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రి వ‌ద్ద‌కు వ‌ట్టి వసంత్ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

కాగా,  వట్టి వసంత్ కుమార్ మృతి ప‌ట్ల ప‌లువురు రాజకీయ నాయ‌కులు సంతాపం తెలిపారు.

ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version