Ex Minsiter Kuthuhalamma : మాజీ మంత్రి కుతూహలమ్మ మృతి.. పలువురు ప్రముఖుల సంతాపం

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 12:17 PM IST

Ex Minsiter Kuthuhalamma : ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో 1949 జూన్ 1న కుతూహలమ్మ జన్మించారు. ఎంబీబీఎస్ చేసిన కుతూహలమ్మ కొంతకాలం వైద్య వృత్తిని చేపట్టారు. రాజకీయాలపై ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. వేపంజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. వేపంజేరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు.

ఆమె 1985 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే, 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంతకు ముందు ఆమె రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2021లో ఆమె కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె మృతికి సంతాపంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/