Site icon Prime9

Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు తీవ్ర అస్వస్థత – ఆస్పత్రికి తరలింపు

eknath shinde hospitalised

Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్‌ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఏటూ తేలని నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురికావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అందులో నెగిటివ్ రాగా వైట్‌ సెల్స్‌ కౌంట్‌ పడిపోయినట్టు వెల్లడైంది. అందువుల్లే ఆయన అస్వస్థకు గురయ్యారని, ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు రాజకీయవర్గాలు తెలిపాయి. తీవ్ర జ్వరం కారణంగా ఆయన యాంటి బయాటిక్స్‌ ఇస్తున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు రాజకీయ నాయకులు వరుసగా ఆస్పత్రికి వెళుతున్నారు. మరోవైపు ప్రధానీ మోదీ, హోం మినిష్టర్‌ అమిత్‌ షా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version