New Delhi: అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారంఅరెస్టు తర్వాత, కోర్టు రామకృష్ణను నాలుగు రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు పంపింది.
విజిల్-బ్లోయర్’ ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత 2015 ప్రారంభంలో కోలొకేషన్ విషయంపై సెబీ తన దర్యాప్తును ప్రారంభించింది. కొంతమంది బ్రోకర్లు కో-లొకేషన్ సౌకర్యం, ముందస్తు లాగిన్ మరియు ‘డార్క్ ఫైబర్’ ద్వారా ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందుతున్నారని ‘విజిల్-బ్లోయర్ ఆరోపించారు.