Site icon Prime9

Dulquer Salman : అందరూ చూస్తుండగానే అసభ్యకరంగా తాకారంటున్న దుల్కర్ సల్మాన్..

dulquer salman interesting comments on fans goes viral

dulquer salman interesting comments on fans goes viral

Dulquer Salman : దుల్కర్ సల్మాన్.. మలయాళంలో స్టార్ హీరో అయిన ఈ యంగ్ హీరో.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే మహనటితో తెలుగు సినీ పరిశ్రమకు కూడా పరిచయం అయ్యాడు. ఇటీవలే సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దుల్కర్ కు విపరీతమైన అభిమానం దక్కింది.

ఇక ప్రస్తుతం ఇప్పుడు దుల్కర్ కింగ్ అఫ్ కోత.. అనే మాస్ యాక్షన్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది. మొదటి సారి దుల్కర్ ఫుల్ మాస్ రోల్ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని వేఫరెర్‌ ఫిలిమ్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా కూడా అనౌన్స్ చేశాడు దుల్కర్.

ప్రస్తుతం ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఆయన (Dulquer Salman) చెప్పుకొచ్చాడు. సాధారణంగా నాకు అబ్బాయిల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. నేనూ వాళ్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటా. అయితే, అభిమానుల కారణంగా గతంలో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. గతంలో ఓ సారి జరిగిన సంఘటన మర్చిపోలేకపోయాను.. ఓ స్టేజ్ పై.. అందరూ చూస్తుండగానే.. ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. ఆమె అంత మందిలో ఆమె అలా చేసేవరకూ ఆక్షణం నేను ఎంతో ఇబ్బందిపడ్డాను అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు తనకు పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఇష్టం ఉండవు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు దుల్కర్. తనకు సరైట్ టైమ్ లె పెళ్లి జరిగిందన్నారు.

Exit mobile version