Director SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.
డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
ఇక లేటెస్ట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
ఇప్పటికే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది ఈ మూవీ.
త్వరలోనే ఆస్కార్ ని కూడా సొంతం చేసుకోవాలని తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మార్చి 12 2023న జరగనున్న అకాడమీ అవార్డ్స్ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ బృందం తమ సినిమాను యూఎస్‌లో స్క్రీనింగ్స్ ద్వారా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
తన రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ మేకింగ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో డబ్బు కోసమే సినిమాలు చేస్తానని రాజమౌళి చెప్పడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
రాజమౌళి (Director SS Rajamouli) ఏం అన్నారంటే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను డబ్బు కోసం, ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తాను తప్ప విమర్శకుల ప్రశంసల కోసం కాదు.
ఆర్‌ఆర్‌ఆర్ కమర్షియల్ సినిమా. నా సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధిస్తే చాలా సంతోషిస్తాను.
ఇంకా అవార్డులు కూడా వస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది.
మా యూనిట్ పడిన కష్టానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
అలానే అందరు ఫిలిం మేకర్స్ లాగే తాను కూడా హాలీవుడ్‌లో సినిమా తీయాలని కలలు కంటున్నట్లు అంగీకరించాడు.
వెస్టర్న్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అయితే హాలీవుడ్‌లో ప్రాజెక్ట్ చేయడానికి బలమైన సహకారం అవసరమని అభిప్రాయపడ్డ జక్కన్న.. భారతీయ సినిమాల ఫిల్మ్ మేకింగ్‌లో మాత్రం తనకు ఇతరుల డైరెక్షన్ అవసరం లేదని చెప్పారు.
గతంలో తనకు నచ్చిన ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ వీడియో గేమ్ సిరీస్‌కు అనుగుణంగా దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపారు.
కాగా జనవరి 24న జరగనున్న ఆస్కార్ నామినేషన్ల ప్రకటనపైనే అందరి దృష్టి ఉంది.
ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడింది.
మరోవైపు ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ తో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తున్నాయి.
కాగా వీటిలో కాంతారా, కాశ్మీరీ ఫైల్స్ ఉన్నాయి.
అదే విధంగా అఫిషియల్ ఎంట్రీగా చెలో షో ని నామినేట్ అయ్యింది. చూడాలి మరి ఆస్కార్ ఈ చిత్రాన్ని వరిస్తుందో అని. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/