PS 2 : లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్-1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో.. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, బాబీ సింహా వంటి భారీ తారాగణం నటించడం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కాగా ఇప్పుడు సౌత్ నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పొన్నియన్ సెల్వన్ విడుదలై ఘన విజయం సాధించింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. చెన్నైలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గ్రాండ్ ట్రైలర్, మ్యూజికల్ ఈవెంట్‌లో భాగంగా `పీఎస్2` ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఇక కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన `పీఎస్ 2` ఈవెంట్‌లో చిత్ర బృందంతోపాటు ఇతర దిగ్గజ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగడం విశేషం. ఇక `పీఎస్2` సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు లాంగ్వేజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ట్రైలర్స్ ని ఏక కాలంలో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, విజువల్ వండర్‌లా సాగింది. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులకు పైఎత్తులు, ట్విస్టులు, టర్న్ లు, పోరాటాలు, వెన్నుపోట్ల సమాహారంగా ట్రైలర్ సాగింది. ఛోళ రాజ్యం స్వాధీనం ఛోళ రాజులు తిరిగి దండయాత్ర చేపట్టడం ప్రధానంగా రెండో భాగం సాగుతుందని ట్రైలర్‌లో అర్థమవుతుంది.
అరుణ్మోలి(పొన్నియిన్ సెల్వన్)(జయంరవి) లంకలో చనిపోయాడనే వార్తతో ఛోళ సామ్రాజ్యాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని నందిని(ఐశ్వర్యారాయ్) తమ అనుచరుణలతో కలిసి కుట్ర చేస్తుంటుంది. తన సోదరుడు చనిపోయాడనే వార్తతో కరికాలుడు(విక్రమ్) తన సైన్యంతో ఛోళ రాజ్యంపై దండయాత్రగా వెళతాడు. పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని తెలిసి పెరియా బ్రదర్స్(శరత్ కుమార్, ప్రభు), మధురాంతకుడు(రెహ్మాన్), నందిని కలిసి కుట్ర చేసి తాను రాజుగా పట్టాభిషేకం చేయడం, మరోవైపు ఛోళ రాజ్యాన్ని రెండుగా విభజించాలనే మరో కుట్ర చేయడం వంటి అంశాల సమాహారంగా ట్రైలర్ సాగింది.
ఇందులో నందినిని పోలిన మరో వృద్ధ మహిళ(ఐశ్వర్య రాయ్) కనిపించడంతో ఆమె ఎవరు, ఆమె కథేంటి? అనేది, పొన్నియిన్ సెల్వన్ ని కాపాడేందుకు వల్లవ రాయన్(కార్తి) చేసే సపోర్ట్ ప్రధానంగా `పొన్నియిన్ సెల్వన్2` సినిమా సాగుతుందని అర్థమవుతుంది. నందిని కుట్రలను తండ్రి సుందర ఛోళన్(ప్రకాష్‌రాజ్)తో కలిసి కుందవై(త్రిష) ఏం చేసిందనేది ఆసక్తికరం. చివర్లో తన మాజీ ప్రియుడు కరికాలుడిని నందినినే చంపేందుకు సిద్దమవడం ఆసక్తిగా మారింది.