Site icon Prime9

Dil Raju : ఆ హీరో కంటే విజయ్ పెద్ద స్టార్ అంటున్న దిల్ రాజు… సోషల్ మీడియా లో ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

dil raju shocking comments about ajith and fans got angry

dil raju shocking comments about ajith and fans got angry

Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. దాదాపు స్టార్ హీరోలు అందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వారసుడు మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటల పై మరో స్టార్ హీరో ఫ్యాన్స్ వ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తమిళనాడులో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్న హీరోలు అంటే విజయ్, అజిత్ పేర్లు గుర్తొస్తాయి. ఇక వీరి సినిమాల రిలీజ్ సమయంలో వారి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంటుంది. గతంలో వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కావడం అప్పట్లో థియేటర్ల వద్ద పెద్ద వివాదానికి దారి తీసింది. ఇక ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి విజయ్ నటిస్తున్న వరిసు సినిమా.. అజిత్ నటిస్తోన్న తునివు మూవీస్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

ఇక వీరి చిత్రాల విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేనందున, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు స్క్రీన్‌ల సంఖ్యను ఖరారు చేస్తున్నారు. ఈ తరుణం లోనే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ… ప్రస్తుతం తమిళనాడులో హీరో అజిత్ కుమార్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని అన్నారు. అందుకే వరిసు సినిమా కోసం మరిన్ని స్క్రీన్స్ కేటాయించాల్సిందిగా… ఉదయనిధి స్టాలిన్ ను అభ్యర్థించేందుకు తాను చెన్నై వచ్చానని ఆయన తెలిపారు. దీంతో దిల్ రాజ్ వ్యాఖ్యలపై అజిత్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు వారసుడు రిలీజ్ కి తెలుగు లో కూడా ఎక్కువ థియేటర్లు కేటాయించారంటూ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version