Site icon Prime9

Prabhas : ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో మళ్ళీ మూవీ.. నరాలు కట్ అయ్యే న్యూస్ చెప్పిన దిల్ రాజు

dil raju comments about movie with prabhas and prashanth neel

dil raju comments about movie with prabhas and prashanth neel

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్  త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆయ‌న సినిమా లైన‌ప్ చూస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. ప్ర‌భాస్ ఇప్పుడు … ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారు. కాగా వీటిలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ సలార్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది.

కాగా ప్రభాస్ తర్వాతి సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు వెల్లడించారు. అది కూడా పౌరాణికమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలోనే పౌరాణిక సినిమా రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. సలార్ తర్వాత.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తారు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా మొదలవుతుంది. అయితే ఈ చిత్రం ఇంకా చర్చల దశలో ఉంది’’ అని వివరించారు. మరోవైపు సలార్ టీజర్ జూన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా విడుదలైన వెంటనే.. టీజర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక దిల్ రాజు చెప్పిన వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో సోషల్ మీడియా వేదికగా హంగామా షురూ చేస్తున్నారు.

కాగా మరోవైపు ప్రభాస్, కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి కృతిసనన్ గత ఏడాది చేసిన సినిమా ‘భేడియా’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్.. కృతిసనన్, ప్రభాస్ తో ప్రేమలో ఉంది అంటూ ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ విషయం పై వీరిద్దర్నీ పలు వేదికల ప్రశ్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో కూడా ప్రభాస్ కి ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.  బాలకృష్ణ, ప్రభాస్ ని ఈ రూమర్స్ గురించి అడగగా అటువంటిది ఏమి లేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version