Site icon Prime9

Dhanush: మరింత ముదిరిన డాక్యుమెంటరీ వివాదం – నయనతార దంపతులపై కేసు

Dhanush filed case on Nayanthara

Dhanush Filed Case on Nayanthara: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, లేడీ సూపర్‌ స్టార్‌ ధనుష్‌ వివాదం మరింత ముదిరింది. నయనతార జీవితం కథ ఆధారం నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరి తీసిన సంగతి తెలిసిందే. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ధనుష్‌-నయన్‌ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అయితే నయన్‌ డాక్యుమెంటరీలో నానుమ్‌ రౌడీ దాన్‌ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్‌ నయన్‌పై కాపీరైట్‌ కేసు వేశారు. దీనికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు కూడా ఇచ్చాడు. దీంతో నయన్ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేసింది.

ధనుష్‌ ఎదుటి వ్యక్తులు ఎదిగితే ఓర్చుకోలేడని, ఒక్క 3 సెకన్ల క్లిప్‌ రూ. 10 కోట్ల దావా వేయడం ఆయన దిగజారుడు తనానికి ప్రతీక అంటూ విమర్శలు గుప్పించింది. అయితే ఈ వివాదం ధనుష్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఈ కేసులో సైలెంట్‌గా చట్టపరంగా ఏం చేయాలో అది చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ వ్యవహరంలో ధనుష్‌ తాజాగా కోర్టులో పటిషన్‌ దాఖలు చేశాడు. అందులో నయనతార ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ పేర్లను పేర్కొంటూ వారిపై నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా దావా వేశాడు. పరిహారం చెల్లించని యెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కోర్టులో దావా వేసినట్టు సమాచారం.

కాగా నయనత తార జీవితంగా ఆధారం నెట్‌ఫ్లిక్స్‌ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఆమె జీవితంలో కీలకమైన ప్రేమ, పెళ్లి, విఘ్నేష్‌తో పరిచయం వంటి జ్ఞాపకాలను పంచుకుంది. ఈ సందర్భంగా తమ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ సినిమాలోని వీడియో వాడేందుకు అనుమతి ఇవ్వాలని నయన్‌ ఈ మూవీ నిర్మాత అయిన ధనుష్‌ కోరింది. అయితే ఈ విషయంలో ధనుష్‌ మౌనం వహిస్తూ వస్తున్నాడు. ఇక అతడు స్పందించకపోవడంతో ఈ సినిమా టైంలో తీసుకున్న మూడు సెకన్ల క్లిప్‌ వాడారు. దీంతో తమ అనుమతి లేకుండ క్లిప్‌ వాడారంటూ నయనతార నోటీసులు ఇచ్చాడు.

కానీ ఈ నోటీసులు నయన్‌, ఆమె భర్త స్పందించకపోవడంతో ఈ మూవీ నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పేర్లు పేర్కొంటూ పటిషన్‌ దాఖలు చేయగా.. తాజాగా దానిని పరిశీలించిన కోర్టు వారిని విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఈ డాక్యుమెంటరీ వివాదం వెలుగు చూసిన తర్వాత ఓ పెళ్లిలో నయనతార, ధనుష్‌లు ఎదురుపడిన సంగతి తెలిసిందే. అక్కడ వీరిద్దరు కనీసం ఒకరినోకు చూసకోలేదు కదా.. బద్ద శత్రువుల్లా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Exit mobile version