Site icon Prime9

Dhanush: అందులో నిజం లేదు – నయనతార, ధనుష్‌ వివాదంపై హీరో తండ్రి షాకింగ్‌ కామెంట్స్‌

Dhanush Father Nayanthara Comments: నయనతార, ధనుష్‌ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కలా రియాక్ట్‌ అవుతున్నారు. ఇండస్ట్రీలోని కొందరు నయన్‌కు సపోర్టు చేస్తుంటే మరికొందరు ధనుష్‌కి మద్దతు ఇస్తున్నారు. నయనతార డాక్యుమెంటరీ విషయంలో వీరద్దరి మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో ధనుస్‌ నిర్మాతగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నయనతార హీరోయిన్లుగా ‘నానుమ్‌ రౌడీదాన్‌'(నేనూ రౌడీనే) తెరకెక్కింది.

ఇందులో మూడు సెకన్ల క్లిప్‌ నయన్‌ డాక్యుమెంటరీలో వాడారు. తన అనుమతి లేకుండ ఆ క్లిప్‌ వాడినందుకు ధనుష్‌ రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ నోటీసులు పంపడంతో నయనతార దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. తన డాక్యుమెంటరిలో ఆ క్లిప్‌ వాడేందుకు ధనుష్‌ అనుమతి కోసం రెండేళ్ల వెయిట్‌ చేశానని, అయినా అతడు స్పందించలేదని తన పోస్ట్‌లో పేర్కొంది. ఇదంత తన వ్యక్తిగత కక్ష్యతో చేస్తున్నాడని, పక్కవారు ఎదిగితే ఓర్చుకోలేడంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది.

అయితే ఈ వ్యవహరం తాజాగా ధనుష్‌ తండ్రి, దర్శక-నిర్మాత కస్తూరి రాజా స్పందించారు. మీడియాలో సమావేశంలో పాల్గొన్న ఆయనకు నయనతార-ధనుష్‌ వివాదంపై ప్రశ్న ఎదురైంది. “నయనతార వ్యవహారం నాకు కాస్తా ఆలస్యంగా తెలిసింది. మా పనిలో మేము బిజీగా ఉన్నాం. ఎప్పుడూ కూడా ముందుకు పరుగెడుతుంటాం. ఈ క్రమంలో మమ్మల్ని తరుముకు వచ్చే వారి గురించి, మా వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునే సమయం మాకు లేదు. అయితే వీడియో క్లిప్‌ కోసం ధనుష్‌ అనుమతి కోసం రెండేళ్లు వెయిట్‌ చేశానని నయనతార చెప్పిన దాంట్లో నిజం లేదు” అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version