Dhanush and Aishwarya Rajinikanth Officially Granted Divorce: కోలీవుడ్ స్టార్ ధనుష్ ఆయన భార్య, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్టు రెండేళ్ల క్రితమే ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 ఏడాది ప్రారంభంలో తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తాము విడిపోతున్నామని చెప్పి అందరిని షాక్ గురి చేశారు. కోలీవుడ్‌లో క్యూట్ కపులైన ఈ జంట విడిపోవడాన్ని ఇండస్ట్రీవర్గాలతో పాటు వారి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. మనస్పర్థలు తొలిగి మళ్లీ కలుస్తారేమో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇరు కుటుంబ సభ్యులు కూడా సర్దిచెప్పి ఇద్దరి కలపాలనే ప్రయత్నాలు చేశారు.
కానీ వీరు మాత్రం విడిపోవాలనే నిర్ణయించుకున్నారు. తాము కలిసి ఉండలేమంటూ చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కోర్టులో విచారణకు హాజరైన వీరు తమకు విడాకులే కావాలని, తమకు కలిసి ఉండాలని లేదని తేల్చేశారు. దీంతో ఫ్యామిలీ కోర్టు వీరికి తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కోర్టు తుది తూర్పు వెలువరించింది. దీంతో ఇప్పుడు ధనుష్-ఐశ్వర్యలు చట్టబద్ధంగా విడిపోయి మాజీ భార్యభర్తలు అయ్యారు. ఇది తెలిసి ఈ జంట అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురైన ఐశ్వర్య రజనీకాంత్‌ని ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు. వారి పేర్లు లింగ,యాత్ర. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించిని వీరిద్దరి వైవాహకి జీవితం మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు పరస్పర నిర్ణయంతో 2022లో జనవరిలో విడాకుల ప్రకటన ఇచ్చారు. రేండేళ్ల తర్వాత వీరికి చట్టబద్ధంగా విడాకులు మంజూరు అయ్యాయి.
మరోవైపు ధనుష్‌కు హీరోయిన్ నయనతారతో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నయనతార డాక్యుమెంటరీ విషయంలో తన అనుమతి లేకుండ తాను నిర్మించిన సినిమాలో క్లిప్ వాడారంటూ నయన్‌కు కోర్టు నోటీసులు పంపాడు. కాపీ రైట్ కింద రూ. 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. తన నోటీసులు నయన్ దంపతులు స్పందించకపోవడంతో వారిపై కోర్టులో దావా వేశాడు. ప్రస్తుతం ఈ కేసు విషయమై ఇండస్ట్రీలో ధనుష్ హాట్‌టాపిక్‌గా మారాడు.