Site icon Prime9

Viral News: “చెప్పులే” ఆ అమ్మవారికి మొక్కుబడులు..!

sandals offering to the jiji bahi temple in bhopal

sandals offering to the jiji bahi temple in Bhopal

Viral News: ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు చెప్పులు బయటే విడిచి వెళతాం. అలా చెప్పులువేసుకుని దేవాలయానికి వెల్లడం అపచారంగా హిందువులు భావిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆ గుడిలోని అమ్మవారికి చెప్పులనే మొక్కులుగా సమర్పించుకుంటారు. మరి ఆ గుడి ఎక్కడుంది ఎందుకు అలా చెప్పులను అమ్మవారికి సమర్పిస్తారో ఈ కథనం చదివెయ్యండి.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్‌ ఆలయం (పహడా వాలీ మాతా మందిరం) ఉంది. అయితే అక్కడ నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి వివిధ నైవేధ్యాలు, డబ్బు బంగారం, దుస్తులు ఇలా సమర్పించి మొక్కులు చెల్లించడం చూసే ఉంటాం. కానీ ఈ గుడికి వెళ్లే భక్తులు మాత్రం స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది అక్కడి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా జిజిబాయ్ అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అయ్య భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుందని కూడా ఇక్కడి స్థానికులు నమ్ముతారు.

ఇకపోతే ఈ అమ్మవారిని స్థానిక భక్తులు తమ కుమార్తెగా భావిస్తుంటారు. అందుకే తమ పిల్లలకు ఎలాంటి వస్తువులు కొనిస్తారో అలాగే అమ్మవారికి కూడా చెప్పులు, బూట్లతోపాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ, దుస్తులు ఇలా పలురకాల వస్తువులు సమర్పిస్తారని పూజారి ఓంప్రకాశ్‌ మహారాజ్‌ తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి సైతం ఈ ఆలయంలోని అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామగ్రి భక్తలు పంపిస్తారని వివరించారు. ఈ ఏడాది సింగపూర్‌, ప్యారిస్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని భక్తుల నుంచి పహడా మాతకు చెప్పులు అందాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. శివుడి ఆజ్ఞ అంటూ చిన్నారి హత్య

Exit mobile version