Site icon Prime9

Adipurush Day 3 Collections : మిక్స్డ్ టాక్ తో కూడా దుమ్మురేపుతున్న ఆదిపురుష్ కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే..?

Adipurush OTT release date

Adipurush OTT release date

Adipurush Day 3 Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Adipurush).. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే పలు వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా భారీ అంచనాల మధ్య గ్యాప్  రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శలు, ట్రోలింగ్, మరింత ఎక్కువయ్యాయి. కానీ మిక్స్డ్ టాక్ తో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కాలక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం మూడు రోజుల్లో కలిపి 300 కోట్ల మార్క్ అధిగమించినట్లు తెలుస్తుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ఈ ఫీట్ అందుకోవడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుషీ అవుతున్నారు.

మొత్తంగా మూడు రోజుల్లో 340 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ చిత్రం మూడు రోజుల్లో 64 కోట్ల షేర్ అందుకుంది. నైజాం లో ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 30 కోట్ల షేర్ సాధించింది. సీడెడ్ లో 7.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.3 కోట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి 8.2 కోట్లు కృష్ణ లో 3.3, గుంటూరులో 5.8 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక హిందీలో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 90 కోట్ల పైనే షేర్ రాబట్టాల్సి ఉంది.

 

 

Exit mobile version