CSK vs DC: నామమాత్రపు మ్యాచ్ లో దిల్లీ తేలిపోయింది. మరోవైపు చెన్నై మాత్రం ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టి.. 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు.
నామమాత్రపు మ్యాచ్ లో దిల్లీ తేలిపోయింది. మరోవైపు చెన్నై మాత్రం ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టి.. 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు.
దిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సూపర్ విక్టరీతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ బెర్తుని ఖరారు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవాన్ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు)
దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
చివర్లో శివమ్ దూబె (22; 9 బంతుల్లో 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (20*; 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు.
దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోకియా, చేతన్ సకారియా ఒక్కో వికెట్ పడగొట్టారు.
చెన్నై నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది.
దిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (86; 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. వార్నర్‌తో పాటు యశ్ ధుల్ (13), అక్షర్ పటేల్ (15) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు.
సీఎస్కే బౌలర్ల ధాటికి పృథ్వీ షా (5), ఫిలిప్ సాల్ట్ (3), రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), నోకియా (0), కుల్‌దీప్ యాదవ్ (0) పెవిలియన్ బాటపట్టారు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరణ 2, మహీశ్ తీక్షణ 2, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ పడగొట్టారు.