Constable Preliminary Exam: ఏపీ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం.. అభ్యర్థులకు సూచనలివే

Constable Preliminary Exam : ఆంధ్రప్రదేశ్ లో రేపు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

5.03 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది.

పరీక్షకు సర్వం సిద్దం

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ( Ap Constable Preliminary Exam) నేపథ్యంలో అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందో బస్తు ను పెట్టనున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కేంద్రాలను పరిశీలించిన అన్ని జిల్లాల కలెక్టర్లు నిఘా కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.

– ఏపీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షజరుగుతుంది

-ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోని అనుమతి ఉంటుంది. ఉదయం 10 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

– అభ్యర్థులు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్స్, నోట్ బుక్స్ , పేపర్స్ వంటివి తీసుకుని రాకూడదు.

-అభ్యర్థులు తమ హాల్ టికెట్, పెన్, ఆధార్ కార్డు / రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు ఖచ్చితంగా తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు బ్లూ / బ్లాక్ పెన్ను ని మాత్రమే వాడాలి.

580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది.

మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు.

6100 కాని స్టేబుల్ పోస్టుల భర్తీకి గాను మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/