Site icon Prime9

Collector Durgarao: హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ దర్శనాన్ని నిరాకరించిన కలెక్టర్

Collector Durga Rao did not allow the High Court judge to visit

Collector Durga Rao did not allow the High Court judge to visit

High court Justice: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పట్ల జిల్లా కలెక్టర్ దుర్గారావు అమర్యాదగా ప్రవర్తించారు. హైకోర్టు జడ్జి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారికి ముందస్తుగా సమాచారం అందించారు. అయితే ఘాట్ రోడ్డులో జడ్జి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. దీంతో జిల్లా అధికారులకు న్యాయమూర్తి వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ద్వారా వాస్తవ సమాచారాన్ని అందించారు. అయితే తమకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ కలెక్టర్ ఢిల్లీరావుపై రిజిష్టార్ జనరల్ కు న్యాయమూర్తి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు.

శరన్నవ రాత్రి వేడుకల్లో దుర్గగుడి ప్రతిష్టను వైకాపా ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసింది. పూజారులు, భక్తులు, ఉభయదాతలు దశరా వేడుకలు తొలి రోజు నుండి నానా ఇబ్బందులు పడ్డారు. డ్యూటీ సిబ్బంది మద్యం సేవించి విధులు నిర్వహిస్తూ ఆలయ పవిత్రతను దెబ్బతీసివున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానురీతిగా ప్రవర్తించి సీఎం జగన్ డౌన్ డౌన్ అనే పరిస్ధితికి తీసుకొచ్చారు. ఘాట్ రోడ్డులో కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. కాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టానురీతిలో తన అనునూయలను అధిక వాహనాల్లో పైకి తీసుకెళ్లారు. ఆధ్యంతం రచ్చ రచ్చగా వైకాపా శ్రేణులు వ్యవహరించారు. తాజాగా హైకోర్టు న్యాయమూర్తినే అనుమతించని స్థాయికి ప్రభుత్వం యంత్రాంగం చేరుకొనింది అంటే వైకాపా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది.

Exit mobile version